కడప జిల్లా యర్రగుంట్లలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని చిలంకూరులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి రశీదులు లేకుండా తరలిస్తున్న 10 లక్షల 18 వేలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విస్తృత తనిఖీలు.. 10 లక్షలు పట్టివేత - kadapa
ఎన్నికల వేళ అక్రమంగా నగదు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 10 లక్షలకు పైగా డబ్బు స్వాధీనం చేసుకొని నగదు తరలింపుపై ఆరా తీసుస్తున్నారు.
పట్టుకున్న నగదుతో పోలీసులు