కడప జిల్లా రాజంపేటలో వాలంటీర్లు, పోలీస్ సిబ్బందితో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో కొత్త వారు ఎవరు కనిపించినా... వెంటనే గుర్తించాలని సూచించారు. మహిళా వాలంటీర్ల సమాచారంతో ఎంతోమందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగచాటుగా వచ్చిన వారి సమాచారాన్ని తెలియజేయాలని చెప్పారు. ఔషధ దుకాణాల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నామని, వారందరినీ గుర్తించి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
'కరోనా కట్టడిలో వాలంటీర్ల పాత్ర కీలకం'
కరోనా కట్టడిలో వాలంటీర్లు, సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందే కీలకమని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని తోట కల్యాణ మండపంలో వాలంటీర్లు, మహిళ పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు.
cadapa dst dsp met volunteer and lady polices in rajampeta