కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పలు అంశాలను వెల్లడించారు. శ్రీశైలం నుంచి 100 టీఎంసీల నీటిని రాయలసీమకు ఇస్తున్నట్లు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. రాయలసీమ నీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక నీటి సమస్య గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నాలుగైదు రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి కడపకు వస్తున్నారని ఆయన వచ్చేలోపు ఈ సమస్య గురించి జీవో విడుదల చేయాలని లేదంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
రాయలసీమలోని నీటి సమస్యకై జీవో విడుదలచేయాలి.. బండి ప్రభాకర్ - bjp presmee
కడపలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ పాల్గొన్నారు.
bjp state offiical representive conducted bjp presmeet at kadapa district.