కడప లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా తెదేపా తరఫున ఆదినారాయణరెడ్డి.. వైకాపా నుంచి ఆ పార్టీ అధినేత జగన్ బంధువు అవినాష్ పోటీ చేశారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి... వైకాపా నుంచి సుధీర్ రెడ్డి పోటీ పడ్డారు. తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డే గెలుస్తారని ఓ నేత 2 కోట్ల రూపాయలు పందెం కట్టారని సమాచారం. మరోవైపు వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి 15వేల మెజారిటీతో విజయం సాధిస్తారని మరి కొందరు లక్షల రూపాయలు పెడుతున్నట్టు తెలుస్తోంది. పందేల కోసం.. కొందరు పొలాలనూ పణంగా పెడుతున్నారు.
కడప జిల్లాలో పోలింగ్ 85 శాతం దాటిన కారణంగా.. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి ఓట్లన్నీ తెదేపాకే పడ్డాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.