ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లా వ్యాప్తంగా సాగిన సార్వత్రిక సమ్మె

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు బంద్​కు ​ పిలుపునిచ్చాయి.కడప జిల్లా మొత్తంగా బంద్ జరిగింది... ర్యాలీలు సాగాయి. సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు.

bahrath bundh news  at  kadapa  district
కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె

By

Published : Jan 8, 2020, 8:28 PM IST

మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. కడప జిల్లా వ్యాప్తంగా సమ్మె జరిగింది. రాజంపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రొద్దూటూరులో జరిగిన సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు కార్మిక సంఘాలు, సీపీఐ కార్యదర్శి విద్యార్థులు ర్యాలీ చేశారు. బద్వేల్ పట్టణంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు కడపలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. కడపలో ర్యాలీ చేస్తున్న ఆందోళనాకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. వైకాపా తెదేపా వామపక్షాలు, ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. మైదుకూరు పట్టణంలో వామపక్షాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. రాయచోటిలోనూ బంద్ నిర్వహించారు.

కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె

ABOUT THE AUTHOR

...view details