వైకాపా అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఎన్నికల ప్రచారం చేశారు. మధ్యలో తారసపడిన జ్యోతిష్యుడితో మాట్లాడారు. జగన్ గెలుపు ఖాయమని.. ఆయన భారతికి నమ్మకంగా చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ సతీమణి
By
Published : Mar 28, 2019, 5:51 PM IST
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ సతీమణి
ప్రతిపక్షనేత, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. కడప జిల్లా పులివెందులలో ప్రచారం చేశారు. పులివెందుల పాతబస్టాండ్ సమీపంలో ఓ జ్యోతిష్యుడు కనిపించగా.. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని కోరారు. జగన్ భవిష్యత్తును వివరించిన జ్యోతిష్యుడు.. విజయం ఖాయమని భారతికి చెప్పారు. తన వాక్కు ఫలిస్తుందని, జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రిఅవుతారని చెప్పారు. ఆనందంగాదక్షిణ సమర్పించుకున్న భారతి... ప్రచారాన్ని కొనసాగించారు.