PCC Working President Tulasi Reddy: రాయలసీమ వాసిగా ఉంటూ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు అన్యాయం చేయడం బాధాకరమని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. వైకాపా పాలనలో రాయలసీమకు నవమోసాలు జరిగాయని కడప జిల్లా వేంపల్లిలో ఆయన పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమతో పాటుగా, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఇవ్వాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం తెప్పించుకోలేక పోయిందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
రాజధాని పేరుతో రాయలసీమకు జగన్ ద్రోహం: తులసి రెడ్డి - rayalaseema issue
AP PCC Working President: రాయలసీమకు సీఎం జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమ వాసులేనన్నారు. రాయలసీమ అభివృద్ధికి.. అవసరమైన నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం పనులు ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంతో పాటుగా రాజధానినీ అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రజలేనని తెలిపారు. స్మార్ట్ మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ రైతులేనని పేర్కొన్నారు. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వైకాపా, తెదేపా, భాజపాలను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: