ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీమ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థ

రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

cm jagan
cm jagan

By

Published : Jun 26, 2020, 8:39 PM IST

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ(ఎస్​పీవీ) ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో... ఈ ఎస్​పీవీని రిజిస్టర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక వాహక సంస్థకు జలవనరులశాఖ నుంచి 5 కోట్ల రూపాయల పెట్టుబడి ధనాన్ని మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రాయలసీమ ప్రాంతానికి నీటి లభ్యతను పెంచేందుకు నిర్దేశించిన 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై ప్రత్యేక వాహక సంస్థ పని చేయనుంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ ద్వారా 40 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details