ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రూప్​1 ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలి' - prilims

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తప్పులతడకగా నిర్వహించారని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. పరీక్షను రద్దు చేయాలని కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.

ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు

By

Published : Jun 10, 2019, 4:48 PM IST

ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు

తప్పుల తడకగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్​ను తక్షణం తొలగించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ సభ్యులు నినాదాలు చేశారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గ్రూప్​-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. పరీక్షల్లో తప్పులకు బాధ్యత వహిస్తూ ఏపీపీఎస్సీ ఛైర్మన్​ పదవి నుంచి ఉదయ్ భాస్కర్​ను తప్పించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details