తనపై నమ్మకం ఉంచి జగన్ అప్పగించిన ఉపముఖ్యమంత్రి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానన్నారు అంజాద్ బాషా. రాష్ట్రంలో అన్యాక్రాంతం అవుతున్న వక్ఫు బోర్డు స్థలాలు, ఆస్తులను కాపాడేందుకు ఎండోమెంట్ తరహాలో కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనారిటీశాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. ముస్లిం మైనారిటీల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈటీవీ భారత్కు మంత్రి తెలిపారు.
కడపకు నీరు తేవడమే నా తొలి ప్రాధాన్యం: అంజాద్ బాషా - kadapa
నవ్యాంధ్రకు తొలి మైనార్టీ ఉపముఖ్యమంత్రిగా చరిత్రలో చెరగని పేరు లిఖించుకున్నారు ఆంజాద్ బాషా. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. తన లక్ష్యాలు, తన భవిష్యత్తు ప్రణాళికలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
కడపను సుందరంగా మారుస్తా
కడప నగరంలో దాహార్తి తీర్చడానికి తాను మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తానన్న అంజాద్ బాషా... సోమశిల వెనక జలాల నుంచి కడపకు తాగునీరు తీసుకు రావడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేందుకు మంత్రులతో సహా అధికారులంతా కట్టుబడి పనిచేయాల్సిందేనన్న ముఖ్యమంత్రి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. అనుభవం చూసి కాకుండా.. మంచి చేసే వారిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. కడపను మురికి రహితంగా, ,సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్న అంజాద్ బాషా అన్నారు.