ఏబీవీపీ ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేటలో కళాశాలల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని కారణంగా.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ కళాశాలల బంద్ - rajampeta
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది.
ఏబీవీపీ