ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న కోసం చెల్లి రోదన..

''అఫ్రి భయ్యా... లే ఇద్దరం ఆడుకుందాం... కుందేలుతో ఆడుకోవా... సైకిల్‌ తొక్కివస్తానన్నావ్‌... నన్ను సైకిల్‌పై ఊళ్లో తిప్పుతానన్నావ్‌...లేవకుండా ఉన్నావే... నాతో ఎవరాడుకుంటారు భయ్యా'' (చెల్లి ఆలియా రోదన).. ''అఫ్రి బేటా లే నాయనా... సైకిల్‌పై ఊళ్లో తిరిగివస్తా అమ్మీ అన్నావే.. ఇంతలోనే ఏమైందిరా అఫ్రిది.. మమ్మల్నొదిలెల్లావా నాయనా.. మేమెవరి కోసం బతకాలి బేటా''.. (తల్లి నూర్జహాన్‌ విలాపం), ''మాకు తోడు ఎవరుంటారు అఫ్రి బేటా.. మేమేం పాపం చేశాం దేవుడా ఇంతపని జరిగిందే... అయ్యో.''( తండ్రి ఖాదర్​ హుస్సేన్​ ఆవేదన)..

sister  deeply saddened by brother death
అనంత లోకాన్ని చేరిన అన్నకై రోదన

By

Published : Dec 27, 2020, 12:26 PM IST

కడప జిల్లా విభరాపురంలో శనివారం ట్రాక్టరు చక్రం కింద నలిగిపోయి మూడోతరగతి చదువుతున్న బాలుడు అఫ్రిది (8) అక్కడికక్కడే మృతిచెందాడు. నిన్న ఉదయం ఇంటి నుంచి బాలుడు సైకిల్‌ తొక్కుకుంటూ బయటకు వచ్చాడు. ఇంతలో వేగంగా వెనుక వైపునకు వచ్చిన ట్రాక్టరు సైకిల్‌ను ఢీకొనడంతో వెనుక వైపు చక్రం కింద పడి తల నుజ్జయిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఖాదర్‌హుస్సేన్‌ , నూర్జహాన్‌ దంపతుల కుమారుడు అఫ్రిది. వీరికి కుమార్తె ఆలియా (6) కూడా ఉంది. ఉదయం సైకిల్‌ తొక్కే అలవాటున్న బాలుడు రోడ్డుపైకి సైకిల్‌పై వెళ్లడంతో వేగంగా వెనక్కి వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

*కళ్లెదుటే ఒక్కొగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మాతృమూర్తి ఖిన్నురాలైంది.. ఉపాధి నిమిత్తం పొరుగు జిల్లాలో ఉంటున్న కన్నతండ్రి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. గుడ్‌నైట్‌ చెప్పిన తన భయ్యా తాను నిద్ర లేచేలోపే ఇక లేడని.. తిరిగిరాడని తెలిసి ఆ చెల్లెలు గుండెలవిసేలా విలపించింది. కమలాపురం మండలంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

అసలేం జరిగిందంటే

ఖాదర్‌హుస్సేన్‌, నూర్జహాన్‌ దంపతులుండే వీధిలోకి ఓ ఖాళీ ట్రాక్టరు వచ్చింది. ఓ ఇంట్లోని సిమెంటు బస్తాలను లోడ్‌ చేసుకోవాలని చోదకుడు ట్రాక్టరును వెనక్కి(రివర్స్‌) తిప్పాడు. అదే సమయంలో అఫ్రిది తన ఇంటి నుంచి సైకిల్‌పై వీధిలోకి వస్తున్నాడు. ట్రాక్టరు చోదకుడు వెనుక నుంచి వస్తున్న బాలుడిని గమనించకుండా వాహనాన్ని రివర్స్‌ చేశాడు. హఠాత్పరిణామంతో బాలుడు సైకిల్‌తోసహా ట్రాక్టర్‌ చక్రాల కింద పడిపోయాడు. చక్రం తలపై వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ఘటనాస్థలంలోనే కన్నుమూశాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాక్టరును స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలుడి మృతికి కారణమైన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండీ...

ప్రియుడి మోసంతో యువతి ఆత్మహత్యాయత్నం.. 2 నెలలుగా కోమాలో

ABOUT THE AUTHOR

...view details