కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో మరోమారు గొలుసు దుకాణంపై అధికారులు దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ అధికారులు 86 మద్యం సీసాలు, ఓ ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు. వీటి విలువ సుమారు 13 వేలు ఉండొచ్చని అధికారులు తెలిపారు. గ్రామంలో అక్రమంగా గొలుసు దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో దాడులు నిర్వహించి 467 మద్యం సీసాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేవగుడిలో 86 మద్యం సీసాలు స్వాధీనం - 86 liquor bottles seized in Devagudi village
జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో గొలుసు దుకాణంపై అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 86 మద్యంసీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
దేవగుడి గ్రామంలో 86 మద్యం సీసాలు స్వాధీనం
TAGGED:
86 liquor bottles seized