కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో వైజంక్షన్ వద్ద దాదాపు 5 కిలోల వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆటోలో తీసుకెళ్తున్న 5 కేజీల 320 గ్రాముల వెండి పట్టీలను సీజ్ చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ సదాశివయ్య తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. వీటిని ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. దినేష్ కుమార్, కైలాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు తమిళనాడులోని సేలం నుంచి వీటిని తెస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. పట్టుబడిన వెండిని ఐటీ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.
ప్రొద్దుటూరులో 5 కేజీల వెండి పట్టివేత
దాదాపు 2 లక్షలు విలువచేసే... వెండి పట్టీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
5 కిలోల వెండి నగల పట్టివేత