ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప సెంట్రల్ జైలులో.. 317 మందికి కరోనా

కేంద్ర హోంమంత్రి మొదలు దిగువస్థాయి కానిస్టేబుల్‌ వరకూ అందరిపైనా ప్రభావం చూపిస్తున్న కరోనా....జైల్లో ఉన్న ఖైదీలనూ వదల్లేదు. కడప కేంద్ర కారాగారంలో 700 మంది ఖైదీలు ఉండగా... అందులో ఇప్పుడు సగం మంది వైరస్‌ బారినపడ్డారు. జైల్లో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికీ కరోనా సోకింది.

corona kadapa
corona kadapa

By

Published : Aug 19, 2020, 5:50 AM IST

Updated : Aug 19, 2020, 6:00 AM IST

కడప కేంద్ర కారాగారంలో కరోనా కేసుల నమోదు.. అధికారులను, ఖైదీలను కలవరపెడుతోంది. కడప జైల్లో మొత్తం 317 మందికి కరోనా సోకింది. జైల్లో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరికీ రెండ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 303 మంది ఖైదీలు కాగా... 14 మంది జైలు సిబ్బంది ఉన్నారు. కరోనా వచ్చిన ఖైదీల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. జైల్లో రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వారం కిందట కూడా ఇదే జైళ్లో 19 మందికి ఖైదీలకు కరోనా సోకింది. వారందరినీ ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎక్కువ మందికి వైరస్‌ సోకడంతో కొవిడ్ ఆసుపత్రికి తరలించే అవకాశం లేదు. జైలు అధికారులు పాజిటివ్ సోకిన వారిని జైలులోనే ప్రత్యేక గదుల్లో పెట్టి ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్నారు. కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే కారాగారంలో ఖైదీలతో ములాఖత్ లు నిలిపివేశారు . పెరోల్ మీద ఎవరినీ బయటకు పంపడం లేదు. పెరోల్ మీద వెళ్లిన వారిని లోనికి అనుమతించే పరిస్థితి లేకుండా పోయింది.

జైలులో అధిక సంఖ్యలో ఖైదీలకు కరోనా సోకడంతో మిగతా బ్యారక్ లలోని ఖైదీలు తీవ్ర భయానికి లోనవుతున్నారు. తమను పెరోల్ మీద ఇంటికి పంపించాలని జైలు అధికారులను కోరుతున్నారు. జైలు అధికారులు కారాగారంలో అన్ని బ్యారక్ ల్లోనూ సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తూ.. అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.

కడప సెంట్రల్ జైలులో.. 317 మందికి కరోనా

ఇదీ చదవండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డికి కరోనా

Last Updated : Aug 19, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details