వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నవైకాపా అధ్యక్షుడు జగన్...నేడు గవర్నర్‌ను కలవనున్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగే వివేకా అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి... సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలని గవర్నర్‌ను కోరనున్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన హత్యలపై ఫిర్యాదు చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో, నల్ల రిబ్బన్లతో శాంతియుత ప్రదర్శన చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.