ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అబ్బయ్యచౌదరి స్వగ్రామంలో తనిఖీలకు వస్తారా'.. పోలీసులను అడ్డుకున్న వైకాపా నేతలు - పోలీసులను అడ్డుకున్న వైకాపా నాయకులు

YSRCP Leaders Stop Police: ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో తమ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కలెక్టర్, ఎస్పీకీ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లారు. అయితే పోలీసులు తనిఖీలకు వస్తారనే సమాచారం ముందే తెలుసుకున్న వైకాపా నాయకులు.. వారిని అడ్డగించారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..

YSRCP Leaders Stop Police
పోలీసులను అడ్డుకున్న వైకాపా నాయకులు

By

Published : Mar 22, 2022, 1:09 PM IST

YSRCP Leaders Stop Police: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామన్నగూడెంలో తనిఖీలకు వచ్చిన పోలీసులను వైకాపా నాయకులు అడ్డగించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గ్రామమైన రామన్నగూడెంలోకి పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ప్రజా స్పందన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీకి రామన్నగూడెంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీలకు ముందుగానే వస్తారనే సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు అప్రమత్తమై రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వారితో వాగ్వాదానికి దిగారు.

'అబ్బయ్య చౌదరి స్వగ్రామంలో తనిఖీలు చేయడానికి ఎలా వచ్చారు' అంటూ ప్రశ్నించారు. గ్రామంలోకి రావడానికి మీరు ఎవరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు స్పందించలేదు సరి కదా అసహాయ స్థితిలో తనిఖీలు చేయకుండానే వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details