ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య...! - lady died

జంగారెడ్డి గూడెంలో ఓ గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె ఆత్మహత్యకు కారణమని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

భర్త వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య...!

By

Published : May 12, 2019, 8:31 AM IST

భర్త వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య...!

ప్రకాశం జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంవాసి గాది మానస... అమలాపురం గ్రామానికి చెందిన చెల్లుబోయిన శివ ప్రసాద్‌... ప్రేమించుకుని 7 నెలల క్రితం పెద్దతిరుపతిలో వివాహం చేసుకున్నారు. వారిద్దరుపశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కాపురం పెట్టారు. ఇటీవల మానస గర్భిణీని అని తెలిసింది. ఇది నచ్చని శివ... అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం నెలకొందని స్థానికులూ చెబుతున్నారు. ఈ గొడవలు కారణంగానే మానస ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని వివరిస్తున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details