పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 47వ డివిజన్ నూకాలమ్మ గుడి సమీపంలోని కమ్యూనిటీ హాలులో వార్డు సచివాలయాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత మహిళలు ఆందోళనచేశారు. సచివాలయ కార్యాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ గేటుకి తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కమ్యూనిటీ హాలు తమకే ఉంచాలంటూ ఆందోళన చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులు ఉన్నామని...కమ్యూనిటీ హాలు ప్రారంభం నుంచి ఎన్నో శుభకార్యాలను నిర్వహించుకున్నామని వివరించారు. అలాంటిది ఇందులో వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తే తామంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. తక్షణమే సచివాలయాన్ని మార్చాలని...లేదంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'అక్కడ సచివాలయం ఏర్పాటుచేస్తే ఊరుకోం'
కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాన్ని మార్చాలంటూ ఏలూరులో పలువురు మహిళలు ఆందోళనలు చేశారు.
కమ్యూనిటీ హాలులోని వార్డు సచివాలయం వద్దంటూ మహిళల ఆందోళనలు