ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలిపించండి.. 100 పడకల ఆసుపత్రి కట్టిస్తా! - pawan kalyan

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే భీమవరంలో వందపడకల ఆస్పత్రి నిర్మిస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.

భీమవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేనాని

By

Published : Mar 22, 2019, 11:52 PM IST

భీమవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేనాని
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధ్యక్షుడుపవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే భీమవరంలో వందపడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లా.. తన సొంతిల్లని పవన్ వ్యాఖ్యానించారు. నాయకులు చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకే వచ్చానని.. తనను ఆశీర్వదించాలని కోరారు. వివేకా హత్య జరిగితే.. జగన్ బాధ్యత లేకుండా వ్యవహరించారని పవన్ దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లా భయాందోళనలతో బతకాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details