ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు ఓటేస్తే  రాష్ట్రం అధోగతి పాలే: వంగవీటి - ఉంగుటూరు

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెదేపా నేత వంగవీటి రాధా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులుకు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం

By

Published : Mar 31, 2019, 5:35 AM IST

వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం
వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెదేపా నేత వంగవీటి రాధా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు తెదేపా అభ్యర్థి గన్ని వీరాంజనేయులుకు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మోదీ, అమిత్ షాలు జాతీయ స్థాయి దొంగలని విమర్శించారు. ప్రతిపక్షనేత జగన్​కు వీరంతా అండగా నిలబడి దొంగల సామ్రాజ్యం ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్ల రూపంలో ప్రజలు ఈ కుట్రని తిప్పికొట్టాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలని వస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తున్న చంద్రబాబునాయుడును గెలిపించాలని అభ్యర్థించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details