పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం ఆలివేరు గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయంలో స్నానానికి వెళ్లి దీపక్ హర్ష (17) అనే యువకుడు గల్లంతు అయ్యాడు. దీపక్ హర్ష జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు అయినందున జంగారెడ్డిగూడెం నుంచి నలుగురు స్నేహితులతో కలిసి జలాశయం వద్దకు వెళ్లాడు. స్నానం చేసే సమయంలో దీపక్ హర్ష లోతుకి వెళ్లి మునిగిపోయినట్లు మిత్రులు తెలిపారు.
స్నేహితులతో ఈతకు వెళ్లి.. గల్లంతయ్యాడు - The young man went swimming and lost
అతని తండ్రి చనిపోయాడు. తల్లి ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న ఆ యువకుడు ఇవాళ స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.
దీపక్ హర్ష (పాత చిత్రం)
ఎనిమిది సంవత్సరాల క్రితం దీపక్ హర్ష తండ్రి అనారోగ్యంతో మరణించగా తల్లి ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. హర్ష భీమవరంలో అక్క ఇంటివద్ద ఉంటున్నాడు. ఆదివారం వసతిగృహం నుంచి జంగారెడ్డిగూడెంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చి స్నేహితులతో జలాశయం వద్దకు వెళ్లాడు. సాయంత్రం వరకు గాలించినా మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు జాలర్లతో కలిసి జలాశయంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.