ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాయామ ఉపాధ్యాయుడిపై పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు - నరసాపురంలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయనిపై తొమ్మిదో తరగతి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారున్ని ఉపాధ్యాయుడు వాతలు తేలేలా కొట్టాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పోలీస్​స్టేషన్

By

Published : Oct 29, 2019, 4:50 PM IST

ఉపాధ్యాయుడిపై పోలీసులకు విద్యార్థి తండ్రి ఫిర్యాదు

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు... తన కుమారుడు షబ్బీర్​ బాషాను వాతలు తేలేలా కొట్టాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఓ విద్యార్థినికి తలనొప్పిగా ఉందని... మందులు తీసుకురావాలని పీఈటీ ఉపాధ్యాయుడు రాజు... తనకు చెప్పినట్లు విద్యార్థి షబ్బీర్​ బాషా తెలిపాడు. కిలోమీటరు దూరంలో మందుల షాపుకు వెళ్లి ఆలస్యంగా వచ్చానని తనను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టాడని ఆరోపించాడు. భయంతో విషయాన్ని తన తండ్రికి చెప్పినట్లు వివరించాడు. దీనిపై తండ్రి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే తాను చిన్న దెబ్బ మాత్రమే వేసి గద్దించినట్లు ఉపాధ్యాయుడు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details