పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు వందేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దాతలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో నిర్మించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయడంపై గ్రామస్థులు నిర్వాహకులను అభినందించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన వారిని ప్రత్యేకంగా సన్మానించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా హాజరైన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శృంగవృక్షంలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ
పశ్చిమగోదావరి జిల్లా శృంగవృక్షంలో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా హాజరైన భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ
ఇదీ చదవండి:
ఎమ్మెల్సీ మనవడి వివాహానికి హాజరైన సీఎం