ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండపాకలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఇంటి పెద్ద మృతి

కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ ఇంటి యజమాని ఫ్యాన్​కు ఉరి వేసుకొని మరణించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండపాకలో జరిగింది.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఇంటి పెద్ద మృతి

By

Published : Sep 28, 2019, 6:33 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఆ ఇంటి యజమాని ప్రాణాలు తీసుకునేలా చేశాయి. మండపాక గ్రామానికి చెందిన పొట్ల ప్రసాద్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ ఇంట్లోని ఫ్యాన్​కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని అన్న కుమారుడు రాజీవ్​ గాంధీ తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఇంటి పెద్ద మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details