పశ్చిమ గోదావరి జిల్లా కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ అమలులో ఉండటంతో మూడు చక్రాలు తిరగక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ల పట్ల ఉండ్రాజవరం ఎస్ఐ అవినాష్ తన వితరణ చాటుకున్నారు. మండలంలోని సుమారు 400 మంది ఆటో కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.ఎస్. చైతన్యకృష్ణ పంపిణీ ప్రారంభించారు. ఎస్సై అవినాష్ ఆటో కార్మికుల పట్ల చూపిన వితరణకు సిఐ చైతన్య కృష్ణ ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయం అందించానని ఎస్సై అవినాష్ తెలిపారు.
ఆటో కార్మికులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎస్ఐ
కరోనా వైరస్ విపత్తు బారినపడి పేద బడుగు వర్గాలు అల్లాడుతుంటే దాతలు తమ వంతు సహాయం అందిస్తూ ఆదుకుంటున్నారు. పోలీసులు సైతం ఖాకీ దుస్తుల మాటున దాగి ఉన్న మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆటో కార్మికులకు కూరగాయల పంపిణీ చేసిన ఎస్ఐ