ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ.. బంగారు, వెండి వస్తువులు అహహరణ - latest chori in kangareddy gudem

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం భారీ చోరీ జరిగింది. వేమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం దొంగలు పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు అపహరించుకుపోయారు.

robbery, jangareddy gudem
జంగారెడ్డి గూడెంలో మరో భారీ చోరీ..బంగారు, వెండి వస్తువులు అహహరణ

By

Published : Feb 5, 2020, 6:59 AM IST

జంగారెడ్డి గూడెంలో భారీ చోరీ..బంగారు, వెండి వస్తువులు అహహరణ

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస చోరీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 3 రోజుల క్రితం ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం మరువక ముందే పట్టణంలో మరో చోరీ జరిగింది. వేమూరి శ్రీనివాసరావు ఇంట్లో దొంగలు పడి 40 కాసుల బంగారం, 10 కిలోల వెండి, 10 వేల నగదును దోచుకెళ్లారు. ఫిబ్రవరి ఒకటిన... బాధితుడు తన కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరం వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.



ఇవీ చూడండి-హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో యువకుడి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details