అనంతపురం జిల్లా కదిరి మండలం వరిగిరెడ్డిపల్లి.. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:మైలవరం జలాశయంలో పడిపోయిన మహిళ... కాపాడిన పోలీసులు..!