పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాల్లో నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు సేల్ అగ్రిమెంట్ ద్వారా హక్కులు కల్పించనున్నారు. రుణాలు మంజూరు అయిన తరువాత ఒప్పందం ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. జిల్లాలోని టిడ్కో గృహాలు నిర్మించిన 8 మున్సిపాలిటీల్లో 25 వేల 488 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
మున్సిపల్ కమిషనర్లు లబ్ధిదారుల జరిగే ఒప్పందం తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తారు. లబ్ధిదారులు ప్రభుత్వం తాజాగా తగ్గించిన ప్రకారం తమ భాగస్వామ్య మొత్తాలను ముందుగానే చెల్లించవలసి ఉంటుంది. ఏ కేటగిరీ లబ్ధిదారులు ఒక రూపాయి, బి కేటగిరీ లబ్ధిదారులు 25,000, సీ కేటగిరీ లబ్ధిదారులు 50 వేల రూపాయలు చెల్లించాలి. గతంలో బి కేటగిరి లబ్ధిదారులు 50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా 25 వేల రూపాయలకు, సీ కేటగిరి లబ్ధిదారులు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉండగా 50 వేల రూపాయలకు తగ్గించారు.