తణుకులో పోలీసుల కళ్ళుగప్పి ఖైదీ పరార్ - remand
ఓ ఖైదీ పోలీసులను బురిడీకొట్టించాడు. కోర్టులో శిక్షపడిన నిందితుణ్ని సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మధ్యలో ఆరోగ్యం బాగాలేదని అతను నాటకమాడాడు. నమ్మిన పోలీసులు తణుకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడే వారి కళ్లు గప్పి ఉడాయించాడా నిందితుడు
గుడివాడు చెందిన సిద్ధు ద్విచక్రవాహనాలు దొంగిలిస్తుండాటు. ఆయన్ని అరెస్టు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు... జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు శిక్ష విధించింది. ఈ శిక్ష అమలు కోసం తణుకు సబ్ జైలుకు తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆరోగ్యం బాగాలేదని సిద్ధు పోలీసులకు చెప్పాడు.ఆయాసంగా ఉందని చెప్పాడు.అది నమ్మిన భద్రతా సిబ్బంది ఆయన్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు.వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగానే రక్షకభటుల కళ్లు గప్పి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసికొని గాలింపు చర్యలు చేపట్టారు.