Rape: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ మైనర్ పై.. అఘాయిత్యం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు.. ఎస్సై కె. సుధాకర్ రెడ్డి తెలిపారు.
పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఈ నెల 3న.. బాలికలను అడపడచుకు అప్పగించి ఏలూరు వెళ్లారు. కాగా.. ఆ మహిళ స్నానానికి వెళ్లటం గమనించిన ఇంటికి ఎదురుగా ఉండే యువకుడు (22).. వారి ఇంట్లోకి చొరబడి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఫోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికపై అఘాయిత్యం.. పోలీసుల అదుపులో నిందితుడు - పశ్చిమగోదావరిలో మైనర్ బాలికపై అఘాయిత్యం
Rape: రాష్ట్రంలో రోజు ఏదో ఓ చోట మహిళలు, మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. దుండగులు వారి పని వారు చేసుకుపోతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు. తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో మేనత్త ఇంట్లో ఉన్న ఓ బాలికపై అత్యాచారం జరిగింది.
మైనర్ బాలికపై అఘాయిత్యం.. పోలీసుల అదుపులో నిందితుడు