పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లి గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో నివసించే గిరిజనులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ సరకులు అందచేయాలని అధికారులకు చెప్పారు.
పోలవరం మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన - పోలవరం గిరిజనులకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే బాలరాజు
పోలవరం మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. లాక్ డౌన్ వేళ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరకులు పంపిణీ చేయాలని అధికారులకు చెప్పారు.
పోలవరం మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన