పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారావు పేట ప్రాంతంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్త ముత్తా శ్రీ కృష్ణ మూర్తి(75) ఇంటి బయట నీటి తొట్టిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. మృతుడి మెడలో చీర చుట్టి ఉండటం గమనార్హం.
SUSPICIOUS DEATH: నీటి తొట్టిలో భర్త శవం.. ఉరేసుకున్న స్థితిలో భార్య మృతదేహం.. - west godavari district news
OLD COUPLE SUSPICIOUS DEATH
10:52 November 13
OLD COUPLE SUSPICIOUS DEATH
అతని భార్య కుమారి (65) ఇంట్లో ఉరి వేసుకొని ఉన్న స్థితిలో విగత జీవిగా కనిపించారు. వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రఘు తెలియజేశారు.
ఇదీ చదవండి:
VIRAL VIDEO : పొగలు కక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికుల బెంబేలు!
Last Updated : Nov 13, 2021, 12:44 PM IST