నివాస ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టొద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని అనకోడేరు శివారు గ్రామానికి చెందిన నక్క యాకోబు, తాళ్లూరి సువర్ణ రాజు హైకోర్టులో ఈ వాజ్యం దాఖలు చేశారు. వందల మంది నివాసం ఉండే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఇళ్ల పరిసరాల్లో డంపింగ్ యార్డ్ వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఇళ్ల వద్ద డంపింగ్ యార్డ్ వద్దంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా అనకోడేరు శివారు గ్రామానికి చెందిన నక్క యాకోబు, తాళ్లూరి సువర్ణ రాజు హైకోర్టులో ఈ వాజ్యం దాఖలు చేశారు.
హైకోర్టు
నివాస ప్రాంతంలో ఎటువంటి డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టొద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది . తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:High court: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు, జరిమానా