పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీలోని పోషణ అభియాన్ ఎన్ఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ జిల్లాలకు చెందిన ఎన్ఎన్ఎంలు నిరసన చేపట్టారు. ఉద్యోగాల తొలగింపునకు నిరసనగా మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించారు. విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఉన్నఫలంగా ఉద్యోగాల తొలగించి రోడ్డున పడేశారని వాపోయారు.
ఉద్యోగాల తొలగింపునకు నిరసనగా ఎన్ఎన్ఎంల ధర్నా
ఉద్యోగాల తొలగింపునకు నిరసనగా పశ్చిమగోదావరి కొవ్వూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయం వద్ద ఎన్ఎన్ఎంలు బైఠాయించారు.
ఉద్యోగాల తొలగింపునకు నిరసనగా ఎన్ఎన్ఎంల ధర్నా