పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకన్నను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. జూలై 8న రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లక్ష కోట్ల రూపాయలతో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.
2006, 2008లో పెనుమంట్ర మండలంలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని అన్నారు. కొందరు నేతలు బినామీ పేర్లతో ఇళ్ల పట్టాలు పొందారని, రిటైర్డ్ ఎమ్మార్వోతో సంతకాలు పెట్టించి పట్టాలమ్ముకున్నారని ఆరోపించారు. వారిపై స్టేషన్లలో కేసులు పెట్టించి, విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.