మధ్యాహ్నం కేంద్ర నిపుణులతో, వైద్యులతో, అధికారులతో సీఎం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆ సమావేశంలో ఏలూరు వింతవ్యాధికి సంబంధించిన కారణాలు నిర్ధరించే ఆస్కారం ఉందని తెలిపారు. ఏలూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. వైద్యం జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వింత వ్యాధి బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ పరిశోధన సంస్థలు వ్యాధి నిర్ధరణ కోసం పనిచేస్తున్నారని.. వారి నివేదికలు ముఖ్యమంత్రికి తెలియజేస్తారని మంత్రి తెలియజేశారు.