కొలతలు, తూకాల్లో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జి. శివబాలాజీ హెచ్చరించారు. జిల్లాలోని జీలుగుమిల్లిలో కాటాలు, తూకం రాళ్లను గురువారం తనిఖీ చేసి ముద్రలు వేశారు. మండలంలో అన్ని రకాల దుకాణాల వద్ద కాటాలకు ముద్రలు వేసి తనిఖీలు చేపట్టమని ఆయన తెలిపారు. విధిగా ముద్రలు వేయించుకోని వ్యాపార సంస్థలపై నాలుగు రోజుల్లో దాడులు నిర్వహించి కేసు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
'కొలతలు, తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు' - తూకాలు కొలతలు తాజా వార్తలు
కొలతలు, తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని.. పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జి. శివబాలాజీ హెచ్చరించారు. జీలుగుమిల్లిలో కాటాలు, తూకం రాళ్లను గురువారం తనిఖీ చేసి ముద్రలు వేశారు. కొలతలు, తూకాల్లో సమస్యలపై తమకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జి. శివబాలాజీ
వ్యాపారులు తమకు సహకరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. జిల్లాలో మోసాలకు పాల్పడే దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. వినియోగదారులు ఇటువంటి సమస్యలపై తమకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహంతి చేపల మార్కెట్లో తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు