పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ పర్యటించారు. తన బంధువులు ఇంటికి వచ్చిన ఆయన... తిరిగి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా నమాజ్ సమయం అయ్యింది. తణుకు వేల్పూరు రోడ్డులోని మసీదులో ఆయన ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిన్న మండలిలో జరిగిన పరిణామాలను వివరించారు. కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఎన్నో మాట్లాడుతుంటారని... వాటిని పట్టించుకోవాల్సినవసరం లేదన్నారు. తననెవరూ ప్రలోభపెట్టలేదని స్పష్టం చేశారు. తనకున్న అధికారంతోనే బిల్లులను కమిటీకి పంపినట్టు చెప్పారు.
'ఆవేశంతో మాట్లాడారు... ఉద్దేశపూర్వకంగా కాదు' - నర్సాపురంలో శాసన మండలి చైర్మన్ పర్యటన
శాసనమండలిలో మంత్రులు ఆవేశంతో మాట్లాడారని మండలి ఛైర్మన్ షరిఫ్ వివరించారు. ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడలేదని చెప్పారు.
శాసనమండలి చైర్మన్ షరిఫ్
TAGGED:
sharif comments on mandali