పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న రోహిత్‌పై తేనెటీగలు దాడి చేశాయి. సెల్ టవర్ నుంచి కిందకు దిగే క్రమంలో రోహిత్ కిందకు జారిపోయాడు. పోలీసులు కిందకు దిగమనడంతో టవర్‌కి ఉన్న తేనెపట్టుపై రోహిత్ అడుగువేశాడు. దీనితో తేనెటీగలు చెలరేగి రోహిత్‌పై దాడి చెయ్యగా.. పక్కనే ఉన్న కల్యాణ మండపంలోకి దూకినట్లు ఇంఛార్జి సీఐ మల్లేశ్వరావు తెలిపారు.
సెల్‌టవర్ ఎక్కిన యువకుడిపై తేనెటీగల దాడి
నిన్న రాత్రి నుంచి సెల్ టవర్‌పై ఓ యువకుడు హల్చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి వస్తేనే దిగుతానంటూ ఆందోళన చేశాడు. తేనెటీగలు దాడి చేయడంతో రోహిత్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న పోలీసులు, మీడియా సిబ్బందిపైనా తేనెటీగలు దాడి చేశాయి.
సోమవారం రాత్రి ఓ యువతిని రోహిత్ వేధిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు కానిస్టేబుల్ రాంబాబు సంఘటనా స్థలానికి వెళ్ళాడు. కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా కానిస్టేబుల్ని రోహిత్ కొట్టడంతో యువకుడిపై జంగారెడ్డిగూడెం స్టేషన్లో కేసు నమోదైంది. ఈ విషయంపై నిన్న రాత్రి రోహిత్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం జరగకపోతే పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు.. శ్రీనివాసపురానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రోద్బలంతో తనని, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ రోహిత్ ఆరోపించాడు. తాను ప్రేమించిన యువతి, నాయకుడు వచ్చేంతవరకు కిందకి దిగనని చెప్పాడు. పోలీసులు సెల్‌టవర్ దిగాలని చెప్పటంతో రోహిత్ కిందకు దిగుతున్నప్పుడు తేనెటీగలు దాడి చేశాయి. పోలీసులు, మీడియా సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయటంతో పరుగులు తీశారు. రోహిత్ ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు