బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీన పడుతున్నట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముందు అంచనా వేసినట్లు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. కోస్తాంధ్ర తీరానికి చేరువగా తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఈశాన్య దిశ నుంచి.. దక్షిణ కోస్తా తీరం వెంబడి నైరుతి దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.
గండం తప్పింది: బలహీనపడుతోన్న తీవ్ర అల్పపీడనం
రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. ముందు అంచనా వేసినట్లు తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
బలహీన పడుతున్న తీవ్ర అల్పపీడనం