..
తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం - పగో జిల్లా తణుకులో కోడి పందేల బరులు ధ్వంసం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలో సిద్ధం చేసిన కోడి పందేల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. తణుకు మండలం తేతలి, దువ్వ, మండపాక, వేల్పూరు గ్రామాల్లో చదును భూమిని ట్రాక్టర్లతో, పారలతో తవ్వించారు. బరులను సిద్ధం చేస్తున్న వారికి పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. నిర్వహణకు స్థలాలు అద్దెకిచ్చే వారికి నోటీసులు జారీ చేశారు.
పోలీసుల ఆధ్వర్యంలో కోడి పందేల బరులు ధ్వంసం