ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిపోయిన... పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల - పశ్చిమగోదావరి జిల్లా పోలవరం

పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలను అధికారులు నిలిపివేశారు. వరదలు రాగానే.. మళ్లీ నీటిని విడుదల చేస్తామన్నారు.

నిలిచిపోయిన... పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల

By

Published : Jun 30, 2019, 3:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. వారం క్రితం గోదావరి జలాలను విడుదలను ప్రారంభించిన అధికారులు.. రోజుకు రెండున్నర వేల క్యూసెక్కుల చొప్పున కృష్ణాకు విడుదల చేశారు. ఈ చర్యతో గోదావరి డెల్టాకు నీటి సరఫకా కష్టమవుతుందని.. ఇటీవలి సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు.. 12 గంటల్లోనే అధికారులు పట్టిసీమ నీటి ఎత్తిపోతలను ఆపేశారు. వరదలు వస్తే.. మళ్లీ నీటిని పంపింగ్ చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details