పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 26 మీటర్లకు చేరుకుంది. పైడిపాక ఫైలెట్ ఛానల్ ద్వారా వచ్చే వరద నీరు ప్రధాన రహదారి గుండా గ్రామంలోకి వచ్చి చేరుతుంది. పోలవరం పైనున్న 19 గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోష్, మంత్రి తానేటి పరిస్థితులపై సమీక్షించారు. ముంపునకు గురైన 19 గ్రామాల ప్రజలు 3 నెలలకు సరిపడా నిత్యవసర వస్తులను 2,122 కుటుంబాలకు పంపిణీ చేస్తామన్నారు. మెత్తం11,018 క్వింటాళ్ల బియ్యం, 40 కిలోల చక్కెర, 64 కిలోల కందిప్పపు, 5 లీటర్ల కిరోసిన్ని ఇస్తామన్నారు. ఎగువ నుండి వచ్చే నీటి ప్రవాహంతో పాటు పాములు కూడా వస్తాయనీ.. వాటి బారి నుండి రక్షణకు ఆంటీ స్నేక్ ఇంజక్షన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉంచాలనీ.. గర్భిణులకు ఇబ్బంది రాకుండాఎన్మ్లను అందుబాటులో పెట్టాలని.. సహాయక శిబిరాలను అన్నీ చోట్ల ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు. మెత్తంగా 7.5 క్యూసెక్కుల నీరు ఉందని..ఇంకా 12 లక్షల నీరు పడుతుందనీ అంచనా వేశారు. వరద ఉద్ధృతి తగ్గేంత వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఈటీవీ-భారత్ ప్రతినిధి అందిస్తారు.
వరద నీటితో పోలవరం ఉప్పొంగుతోంది!
ఎగువ నీటి ప్రవాహంతో గోదారమ్మ పొర్లి పొంగుతోంది..దీంతో అక్కడి ప్రజల పరిస్థితిని సమీక్షించి, వారికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందిస్తామని అధికారుల సూచించారు. 19 గిరిజన గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పోలవరంలో గోదావరి పరవళ్లు