పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. డివిజన్ పరిధిలో రైతు భరోసా రాని రైతులకు తమ భూమి తాలూకా వివరాలు తీసుకురావాలని చెప్పటంతో ఐదు మండలాల నుంచి ఆర్డీవో కార్యాలయానికి అన్నదాతలు పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కార్యాలయానికి తాళాలు వేశారు. దీనిపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమకు రుణ మాఫీ సక్రమంగానే పడ్డాయని, వాలంటీర్లకు అవగాహన లేకపోవటం వల్ల నేడు తమకు పాట్లు తప్పడం లేదని రైతులు వాపోయారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు సాయంత్రం వరకూ రైతుల పత్రాలు పరిశీలించారు.
వైఎస్ఆర్ రైతు భరోసా.. కార్యాలయాల వద్ద అన్నదాత ప్రయాస - వైఎస్ఆర్ రైతు భరోసా కోసం కార్యాలయాల వద్ద ఎదురుచూపులు
రైతు భరోసా కోసం పశ్చిమగోదావరి జిల్లాలో అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ భూమి వివరాలు ఇవ్వాలన్న అధికారుల ఆదేశాలతో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి రైతులు పోటెత్తారు. దీని వల్ల తోపులాట జరిగి ఇబ్బంది పడ్డారు. అయితే వాలంటీర్ల అవగాహన లోపమే దీనికి కారణమని రైతులు వాపోయారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
![వైఎస్ఆర్ రైతు భరోసా.. కార్యాలయాల వద్ద అన్నదాత ప్రయాస](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4945928-602-4945928-1572759825388.jpg)
వైఎస్ఆర్ రైతు భరోసా కోసం కార్యాలయాల వద్ద ఎదురుచూపులు