పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయటంతో... గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పోలవరం మండలం పట్టిసీమ, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని గోదావరి చుట్టుముట్టింది. కొత్తపట్టిసీమ, గూటాల, తాడిపూడిలోని కొన్ని చోట్ల గోదావరి గట్లు బలహీనంగా ఉండటంతో... గ్రామాల్లోకి వరద రాకుండా ఉండేలా ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేశారు. పోలవరం కడెమ్మ వంతెన వద్ద నీరు స్థిరంగా ఉంది. సోమవారానికి తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపం... హెచ్చరిక జారీ - గూటాల
గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో...ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవటంతో... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గోదావరి ఉగ్రరూపం... ప్రమాద హెచ్చరిక జారీ