ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై ముగిసిన వాదనలు

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల విషయంలో హైకోర్టులో దాఖలైన అప్పీళ్లపై వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

hearing completed in high court
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై ముగిసిన వాదనలు

By

Published : Apr 20, 2021, 2:36 AM IST

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల విషయంలో దాఖలైన అప్పీళ్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​లతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా (రిజర్వ్) వేసింది.

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాకే ఏలూరు ఎన్నికలు నిర్వహించాలంటూ... గతంలో తామిచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికలు నిలిపివేశారు. దీనిపై డివిజన్​ బెంచ్​కి వెళ్లగా ఎన్నికలు నిర్వహించి ఓట్ల లెక్కింపు చేపట్టరాదని తీర్పు వచ్చింది. దీనిపై తాజాగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details