" ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి " - collector
రబీ ధాన్యం కొనుగోలులో అవకతవకలపై తక్షణం విచారణ జరపాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం ఆందోళనకు దిగింది. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
" ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి "
జిల్లాలో 285 కేంద్రాలు తెరిచినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారని, కానీ చాలా కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు ఆరోపించారు. రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు జరపాలని కోరారు. దళారులు, మిల్లర్ల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.