పాలంగిలోని అమ్మవారిని సుమారు టన్ను బరువు గల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారితోపాటు ఆలయ ప్రాంగణ, ముందు భాగాల్ని కూరగాయలతో తీర్చిదిద్దారు. శాకంబరి అలంకారంలో దర్శించుకుంటే భవిష్యత్తులో అన్నపానాదులకు లోటుండదని భక్తులు నమ్ముతారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శాకంబరి రూపంలో అమ్మవారి దర్శనం - శాకంబరి అమ్మవారు
ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు, శాకంబరి అలంకారంలో దర్శనమిస్తూ, భక్తులకు కనువిందు చేస్తున్నారు.
శాకాంబరి అలకరణలో కనకదుర్గ అమ్మవారు
ఇదీ చూడండి..ప్రకృతి నిలయం... తిరుమల ఆధ్యాత్మిక నగరం