ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. తీవ్రస్థాయిలో పెరిగిన వరదతో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం కొయిదా, కట్కూరు గ్రామ పంచాయతీల్లోని 15 గ్రామాలకు వాహన రాకపోకలు ఆగిపోయాయి.
పోటెత్తిన వరద గోదావరి... గ్రామాలకు రాకపోకలు బంద్
గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. వరద ఉద్ధృతితో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడుల మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నిత్యావసరాలు, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తెప్పల సాయంతో వరద గోదావరిని దాటుతున్నారు.
పోటెత్తిన వరద గోదావరి... గ్రామాలకు రాకపోకలు బంద్
పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైకి గోదావరి వరద పోటెత్తింది. నిత్యావసరాలు, వైద్యం కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెప్పల సాయంతో వరద నీటిని దాటుతున్నారు.
ఇదీ చదవండి :అంతం కాదిది.. ఆరంభం: రఘురామకృష్ణరాజు